- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Oyo room: 8 వ తరగతి స్టూడెంట్ తో ఉపాధ్యాయుడు ఎఫైర్.. ఓయో రూమ్ లో దారుణం
8 వ తరగతి స్టూడెంట్ తో ఉపాధ్యాయుడు ఎఫైర్ చివరకు విషాదంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గురు శిష్యుల మధ్య ఉండాల్సిన బంధం నేటి కాలంలో కొంత మంది నిర్వాకం వల్ల మసకబారుతోంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయులు 8వ తరగతి విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో చివరకు ఇద్దరూ కలిసి ఓయో రూమ్ లో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ దారుణ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ చంద్రబాస్ 8వ తరగతి విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరు కలుసుకునేందుకు ఆటంకం ఏర్పడింది. అయినా కుటుంబ సభ్యుల కళ్లుగప్పి రహస్యంగా కలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందే ఏమో కానీ నిన్న అలీఘర్ లో ఓయో రూమ్ లో ఈ జంట శవాలుగా మారారు. అలీఘర్ లోని హోటల్ లో రూమ్ కు వచ్చిన ఈ జంట ఓ రూమ్ తీసుకుంది. అయితే ఆ రూమ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మాస్టర్ కీ తో తలుపు తెరిచి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.






