- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాటా ఏస్ ఢీ కొని యువకుడు మృతి
by Ratna Kumari |
టాటా ఏస్ ఢీ కొని యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో శుక్రవారం చోటు చేసుకుంది.

X
దిశ, మంథని : టాటా ఏస్ ఢీ కొని యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిరిపురం నుంచి మంథని వైపు యువకుడు బైక్ పై వస్తున్నాడు. మంథని నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం యువకుని బైక్ ను ఢీ కొట్టింది. ఆ యువకుడి తలకు బలమైన దెబ్బలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడిది మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామం రాయిని దేవేందర్ (30) గా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు మంథని పోలీసులు తెలిపారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






