- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దెయ్యం పేరుతో.. బాలికను నగ్నంగా కూర్చోబెట్టి.. ఉప్పు, నిమ్మకాయతో ఒళ్లంతా రుద్ది.. ఆపై అత్యాచారం
పన్నెండేళ్ల బాలిక.. మానసికంగా అనారోగ్యంగా ఉంది.. కానీ తల్లిదండ్రులు ఆమెకు దెయ్యం పట్టిందని ఓ మాంత్రికుడిని ఇంటికి తీసుకొచ్చారు. పాప ఎలా ప్రవర్తిస్తుందో చెప్పారు. దీంతో అతను బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లి.. బట్టలు విప్పి.. ఒళ్లంతా ఉప్పు,

దిశ, వెబ్ డెస్క్ : పన్నెండేళ్ల బాలిక.. మానసికంగా అనారోగ్యంగా ఉంది.. కానీ తల్లిదండ్రులు ఆమెకు దెయ్యం పట్టిందని ఓ మాంత్రికుడిని ఇంటికి తీసుకొచ్చారు. పాప ఎలా ప్రవర్తిస్తుందో చెప్పారు. దీంతో అతను బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లి.. బట్టలు విప్పి.. ఒళ్లంతా ఉప్పు, నిమ్మకాయతో రుద్దాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బాలిక అరవడంతో తల్లిదండ్రులు లోపలకు వచ్చేందుకు ప్రయత్నించగా.. మీరు లోపలికి వస్తే దెయ్యం విడిచిపెట్టి వెళ్లదని చెప్పి భయపెట్టాడు. బయటనే ఉండాలని సూచించాడు. దీంతో తల్లిదండ్రులు బయటే ఉండిపోగా.. ఆమెను రేప్ చేశాక.. 30 నిమిషాల తర్వాత బయటకొచ్చిన మాంత్రికుడు.. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా.. బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఈ ఘటన జరగ్గా.. బాధిత తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో మాంత్రికుడు హర్భజన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.






