మధురలో దారుణం.. పిల్లలు కలగాలని మంత్రగాడి దగ్గరకు వెళ్లిన మహిళ.. ఆచారం పేరుతో అత్యాచారం!

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మధురలో దారుణం చోటు చేసుకుంది. నౌజీల్ ప్రాంతంలో పిల్లలు కలగాలని ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు ఓ తాంత్రికుడి దగ్గరకు వెళ్లింది 35ఏళ్ల మహిళ. దీంతో అతను ఒక ఆచారం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపి..

మధురలో దారుణం.. పిల్లలు కలగాలని మంత్రగాడి దగ్గరకు వెళ్లిన మహిళ.. ఆచారం పేరుతో అత్యాచారం!
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ వైపు ప్రపంచం దూసుకుపోతుంటే.. మూఢనమ్మకాలకు బలైపోతున్నారు జనాలు. ముఖ్యంగా పల్లెటూళ్లలో జనాల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు మాంత్రికులు. ఆచారాల పేరుతో డబ్బులు దండుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ఆచారాల ముసుగులో సమాజానికి హాని కలిగించే పనులు చేస్తున్నారు. ఇలాంటిదే ఈ ఘటన కూడా. ఓ వైపు పిల్లల కోసం ఐవీఎఫ్ లాంటి టెక్నిక్స్ అందుబాటులో ఉండగా.. ఓ మహిళ సంతానం కోసం బాబా దగ్గరకు బలైపోయింది. ఉత్తరప్రదేశ్ మధురలో దారుణం చోటు చేసుకుంది. నౌజీల్ ప్రాంతంలో పిల్లలు కలగాలని ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు ఓ తాంత్రికుడి దగ్గరకు వెళ్లింది 35ఏళ్ల మహిళ. దీంతో అతను ఒక ఆచారం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపి.. మత్తుమందు ఇచ్చిన తాంత్రికుడు.. ఆమెపై అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. కాగా నిందితుడు ముష్టాక్ అలీపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అలీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బాధిత మహిళకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా సంతానలేమితో బాధపడుతోంది. కుటుంబం, బంధువులు, చుట్టుపక్కల వారి బాధ తట్టుకోలేక ఈ బాబా దగ్గరకు వెళ్లినట్లు సమాచారం.

Next Story