పిల్లలు పుట్టిస్తానని అత్యాచారం చేసిన స్వామిజీ.. ఆపై దేవుడే సెక్స్ చేశాడని..

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-08-11 16:25:18  IST  )

డిజిటల్ యుగంలోనూ ఇంకా మూఢభక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు కొందరు. అలాంటి వారి బలహీనతలనే క్యాష్ చేసుకుంటున్నారు కొందరు దొంగ స్వాములు, బాబాలు.

పిల్లలు పుట్టిస్తానని అత్యాచారం చేసిన స్వామిజీ.. ఆపై దేవుడే సెక్స్ చేశాడని..
X

దిశ, వెబ్‌డెస్క్ : డిజిటల్ యుగంలోనూ ఇంకా మూఢభక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు కొందరు. అలాంటి వారి బలహీనతలనే క్యాష్ చేసుకుంటున్నారు కొందరు దొంగ స్వాములు, బాబాలు. పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ బాబా దగ్గరకు వెళ్తే అత్యాచారం చేసి పంపించాడు ఆ కామాంధుడు. అతడికి రాజకీయ అండ తోడవడంతో బాధితురాలు అచేతనస్థితిలో ఉండిపోయింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్వామి వైర్యాగ్యనంద గిరిగా ఓ వ్యక్తి తనకు తానుగా స్వామిగా ప్రకటించుకుని అమాయక భక్తులను ఆకర్షించాడు. ఈ క్రమంలో అతడు బాగా ప్రాచుర్యం పొందడంతో రాజకీయ అండదండలు లభించాయి. ఇదే అదునుగా ఆ కన్నీంగ్ స్వామిని తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. స్వామి వైర్యాగ్యనంద గిరి దగ్గరకు వెళ్తే సమస్యలు తీరుతాయని వచ్చే భక్తులను వంచిండం మొదలు పెట్టాడు. ఇది తెలియని ఓ మహిళ తనకు సంతానం కలగడం లేదని స్వామి వైర్యాగ్యనంద గిరిని ఆశ్రయించింది. అయితే ఆమెకు సంతానం కలిగేలా చేస్తానని ప్రత్యేక పూజల పేరిట ఆ మహిళకు మత్తు పదార్ధం కలిపి ప్రసాదం ఇచ్చిన స్వామిజీ.. ఆమె స్పృహ కోల్పోగానే అత్యాచారం చేశాడు. మెలకువలోకి వచ్చిన మహిళ తనపై అఘాయిత్యం జరిగినట్లు గుర్తించి స్వామిజీని నిలదీసింది. దానికి ఆ కామాంధ స్వామి చెప్పిన మాటలు విని షాక్ తిన్నది. 'నీకు పిల్లలు పుట్టడం లేదని స్వయంగా ఆ దేవుడే వచ్చి నీతో సంభోగం చేశాడు' అని చెప్పడంతో ఖంగుతిన్నది.

అయితే ఆ కామాంధ స్వామికి రాష్ట్రంలోని ఓ ముఖ్యనేత అండ ఉండటం... స్థానిక అధికారులు సైతం అతడి గుప్పిట్లో ఉండటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడింది. స్థానికులు చెప్పిన ధైర్యంతో ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు రాత పూర్వకంగా పిటిషన్ ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్లీజ్‌ అక్కా.. నన్ను ఒంటరిగా వదిలెయ్ : రిషబ్ పంత్ రిక్వెస్ట్ వైరల్

కోడలి తల నరికేసిన అత్త

Next Story