- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త వేధింపులే కారణమా?
ఏపీలోని విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన అరిలోవ బాలాజీనగర్‌లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన అరిలోవ బాలాజీనగర్‌లో చోటు చేసుకుంది. దుర్గ 33 అనే మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. లైఫ్ స్టైల్ స్టోర్ లో ఉద్యోగం చేస్తున్న దుర్గ భర్త దేముడు ఆమెను కొంతకాలంగా అనుమానిస్టున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోవడంతో భర్తనే హత్య చేశాడా? లేదంటే దుర్గనే ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే దుర్గ తండ్రి నర్సింహులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో అనుమానం నేపథ్యంలో నేరాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దీంతో వేధింపులకు గురి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాయి.






