గర్జనపల్లిలో విషాదం.. పొలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Bhanu |

వ్యవసాయ పొలంలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన జిల్లాలోని వీర్లపల్లి మండలంలో చోటుచేసుకుంది.

గర్జనపల్లిలో విషాదం.. పొలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : వ్యవసాయ పొలంలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన జిల్లాలోని వీర్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గర్జనపల్లి గ్రామానికి చెందిన జోగుల మనోహర్ (43) అనే వ్యక్తి మృతదేహాన్ని గ్రామ శివారులోని ఓ వ్యక్తి పొలంలో ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై లక్ష్మణ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story