- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత ఇంట్లో మకాం.. బంగారం షాప్ టార్గెట్..! సూర్యాపేట చోరీకేసులో సంచలన విషయాలు
సూర్యాపేటలో బంగారం దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ,సూర్యాపేట : సూర్యాపేటలో బంగారం దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఐదుగురు వ్యక్తులు ఈ దొంగతనాన్ని ముందే ప్లాన్‌చేసి చేశారని పోలీసులు తెలిపారు. దాదాపు రెండు నెలల క్రితమే వారు ఓ పాత ఇంటిని అద్దెకు తీసుకొని, పది రోజులుగా అదే ఇంట్లో ఉంటూ చోరీకి ఏర్పాట్లు చేసుకున్నారు.
వారు గత 40 రోజులుగా అదే ఏరియాలో తిరుగుతూ, సాయి సంతోషి జ్యువెల్లరీ షాప్‌పై నిశితంగా గమనిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి పక్కా ప్రణాళికతో షాప్‌ను టార్గెట్ చేసి చోరీ చేశారు. ఈ కేసును పోలీసులు ఎంతో సీరియస్ గా తీసుకొని ఐదు బృందాలుగా విచారణ చేపట్టారు. రెండు బృందాలు ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినట్లు సమాచారం.
చోరీకి పాల్పడినవారు అద్దె ఇల్లు తీసుకుంటూ ఇంటి యజమానికి ఆధార్ కార్డు వంటి వివరాలు ఇవ్వకపోవడం గమనించదగిన విషయం. అలాగే, వారు జనాల్లో కలిసి తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం ఆశ్చర్యకరం. ఇప్పటికే వారి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జనవాసాల్లో తిరుగుతున్న దృశ్యాలు దిశకు అందాయి.






