- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండలంలో పెరుగుతున్న వడదెబ్బ మృతులు
మండలంలో ఇప్పటివరకు వడదెబ్బతో ఐదుగురు చనిపోయారు. తాజాగా మంగళవారం మరో ఇద్దరు మృతి చెందారు. కోమటిపల్లికి చెందిన వాసం లక్ష్మీనర్సు(60) వడదెబ్బకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

దిశ, మంగపేట : మండలంలో ఇప్పటివరకు వడదెబ్బతో ఐదుగురు చనిపోయారు. తాజాగా మంగళవారం మరో ఇద్దరు మృతి చెందారు. కోమటిపల్లికి చెందిన వాసం లక్ష్మీనర్సు(60) వడదెబ్బకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మీనర్సు రోజువారి పనిలో బాగంగా గ్రామంలో కూలి పనికి వెళ్లగా.. ఎండలు తీవ్రతతో పాటు వడదెబ్బ తగలడంతో తట్టుకోలేక అక్కడే కుప్పకూలిపోగా తోటి కూలీలు ఇంటికి తీసుకొని రాగా కుటుంబ సభ్యులు వైద్యుని దగ్గరకు తీసుకొని వెళ్లగా.. అప్పటికే లక్ష్మీ నర్సు మృతి చెందినట్లు తెలిపారు. అలాగే మండలంలోని కొత్త మల్లూరుకు చెందిన బట్ట పాండు రాజు మంగళవారం మధ్యాహ్నం గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాండు రాజు మధ్యాహ్నం భోజనం సమయంలో జావతాగి పడుకోని నిద్రలోనే మృతి చెందినట్లు వారు తెలిపారు. పాండు రాజు తన తండ్రి నర్సింహారావుతో కలిసి నివసిస్తున్నాడని వెల్లడించారు.






