- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లవ్ మ్యారేజ్ చేసుకునేవాళ్లకు నా జీవితం గుణపాఠం కావాలి.. అమ్మానాన్న నా చివరిచూపుకు రండి!
తిరుపతి జిల్లా పుత్తూరు టౌన్ లో వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కృష్ణానగర్ మూడవ వీధిలో భర్తతో కలిసి నివాసం ఉంటున్న పద్మ తన పిల్లలు తేజ (7), లాస్య(5)తో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా పుత్తూరు టౌన్ లో వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కృష్ణానగర్ మూడవ వీధిలో భర్తతో కలిసి నివాసం ఉంటున్న పద్మ తన పిల్లలు తేజ (7), లాస్య(5)తో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. ఆత్మహత్య చేసుకునే ముందు పద్మ రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. సూసైడ్ నోట్ లో తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతిఒక్కరికీ తన జీవితం గుణపాఠం కావాలని పద్మ పేర్కొంది.
లవ్ మ్యారేజ్ చేసుకున్న పాపానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తలో ఉండకూడదని కోరుకుంటుందో అలాంటి లక్షణాలు అన్నీ తన భర్తలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనను చేసుకున్న పాపానికి ఎంత కష్టపడాలో అంత అనుభవించానని తెలిపింది. ఇప్పుడు తన పిల్లలు కూడా అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఊరంతా అప్పులు చేసి, లోన్లు తీసుకుని నేను తీర్చలేనని అంటే తాను ఏం చేయాలని ప్రశ్నించింది. ఇప్పుడు నువ్వు పనికి వెళ్లకపోయినా, ఎవరితో తిరినా నిన్ను అడిగేవాళ్లు ఉండరు హ్యపీగా ఉండాలని కోరుకుంది. ఎలాగూ రెండో పెళ్లి చేసుకుంటావని, ఇప్పటికైనా జీవితంలో స్థిరపడిన తరవాతనే పెళ్లి చేసుకో అంటూ పేర్కొంది. అమ్మా నిన్ను ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు 8ఏళ్లుగా మిమ్మల్ని చూడలేకపోయాను చివరిసారిగా వచ్చి నన్ను పాప అని పిలవండి, నా పిల్లలను ఒకసారిచూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.






