Suicide: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. అప్పుల బాధలు తాళలేక యువ రైతు బలవన్మరణం

by Kema Shiva Kumar |

అప్పుల బాధలు తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన ఖమ్మం (Khammam) జిల్లా కూసుమంచి (Kusumanchi) మండల పరిధిలోని లోక్యాతండా (Lokya Thanda)లో ఆలస్యంగా వెలుగు చూసింది.

Suicide: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. అప్పుల బాధలు తాళలేక యువ రైతు బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పుల బాధలు తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన ఖమ్మం (Khammam) జిల్లా కూసుమంచి (Kusumanchi) మండల పరిధిలోని లోక్యాతండా (Lokya Thanda)లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన వడియా నవీన్ కుమార్ (Naveen Kumar) (33) తనకు ఉన్న అర ఎకరం పొలాన్ని సాగు చేస్తూనే చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటల్లో మొక్కలు అంటుగట్టే పనికి వెళ్తున్నాడు. కొన్నాళ్ల నుంచి అప్పుల బాధతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలంటూ అప్పులోల్లు ఒత్తిడికి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పని కోసమని చెప్పి 10 రోజుల క్రితం నవీన్ కుమార్ (Naveen Kumar) ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. గురువారం నుంచి అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నవీన్ కోసం వెతకగా.. అతడి వ్యవసాయ భూమిలోనే చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు

Next Story