స‌బ్ స్టేష‌న్ ఆప‌రేట‌ర్ మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, కోట‌ప‌ల్లి : స‌బ్ స్టేష‌న్ ఆప‌రేట‌ర్ మృతి చెందిన సంఘ‌ట‌న కోట‌ప‌ల్లి ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. కోట‌ప‌ల్లి మండ‌లం దేవుల‌వాడ స‌బ్ స్టేష‌న్ లో ఆప‌రేట‌ర్ ప‌ని చేస్తున్న బ‌జ్జూరి సంతోష్ అనారోగ్యంతో

స‌బ్ స్టేష‌న్ ఆప‌రేట‌ర్ మృతి
X

దిశ, కోట‌ప‌ల్లి : స‌బ్ స్టేష‌న్ ఆప‌రేట‌ర్ మృతి చెందిన సంఘ‌ట‌న కోట‌ప‌ల్లి ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. కోట‌ప‌ల్లి మండ‌లం దేవుల‌వాడ స‌బ్ స్టేష‌న్ లో ఆప‌రేట‌ర్ ప‌ని చేస్తున్న బ‌జ్జూరి సంతోష్ అనారోగ్యంతో శ‌నివారం మృతి చెందాడు. కొద్ది రోజుల నుంచి అత‌ను జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాడు. ఆయ‌న చికిత్స నిమిత్తం క‌రీంన‌గ‌ర్ ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య‌, ఇద్ద‌రూ పిల్లలున్నారు. స్వ‌ర్గ‌మైన వెల్మ‌ప‌ల్లి గ్రామంలో మ‌ర‌ణ వార్త విన‌గానే గ్రామం మొత్తం లోక స‌ముద్రంలో మునిగిపోయారు. సంతోష్ సబ్ స్టేషన్ లో చేసిన సేవలను చూసి చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు గుర్తు చేసుకొని కన్నీరు మున్నిర‌య్యారు. దేవుడా ఇది నీకు న్యాయమా.. ఎందుకు ఆ వృద్ధ దంపతుల బ్రతుకు ఆశయాలలో పువ్వులు పంపించావు ఎందుకు ఆ పువ్వు వికసించక ముందే తుంచి వేశావు దేవుడా..? ఆ పిల్లలకు చిరునవ్వులు అందించక ముందే ఆ పిల్లల పెదవులు ఇవాళ మూగబోయేలా చేశావు. దేవుడా అంటూ ఆ ప్రాంత గ్రామాల ప్రజలంతా కన్నీ టి పర్వంత‌మ‌య్యారు.

Next Story