సార్ నా చేయి పట్టుకుని వేధిస్తున్నాడు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

by Sujitha Rachapalli |

ఈ మధ్య విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. స్కూల్‌లో ఎదుర్కొంటున్న అవమానాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ప్రిన్సిపల్‌తోపాటు ముగ్గురు టీచర్లు తనను టార్చర్ చేస్తున్నారని నిన్న పదో

సార్ నా చేయి పట్టుకుని వేధిస్తున్నాడు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. స్కూల్‌లో ఎదుర్కొంటున్న అవమానాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ప్రిన్సిపల్‌తోపాటు ముగ్గురు టీచర్లు తనను టార్చర్ చేస్తున్నారని నిన్న పదో తరగతి విద్యార్థి చనిపోగా.. నేడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. క్లాస్‌రూమ్‌లో అందరి ముందు తనను వేధిస్తున్నాడని ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.

మధ్యప్రదేశ్ రేవాలో ఈ ఘటన జరిగింది. టెన్త్‌లో డిస్ట్రిక్ట్ థర్డ్ ర్యాంక్ వచ్చిన దృష్టి సింగ్.. ఇంటర్‌లో దారుణంగా వేధింపులు ఎదుర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను తన సూసైడ్ నోట్‌లో రాసింది. ‘ పనిష్మెంట్ పేరుతో సార్ నా చేయి పట్టుకునేవాడు. చేయి మూసి తెరిచి చూపించు అనేవాడు. నా చేయి చూడు ఎంత చల్లగా ఉందో అంటూ టేబుల్‌పై చేయి పెట్టి చూడమనేవాడు. నా వేళ్ల మధ్యలో పెన్ను పెట్టి గట్టిగా నొక్కేవాడు’ అంటూ రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన న్యూస్ బయటకు రాగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వెంటనే సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ మేనేజ్మెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story