- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వని యాజమాన్యం.. బిల్డింగ్‌పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
మన దేశంలో విద్య వ్యాపారమైపోయింది. మంచి ఎడ్యుకేషన్ కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నర్సరీకే లక్షలు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్థికంగా వెనకబడిన వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రమాదకర రూపాన్ని సంతరించుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో విద్య వ్యాపారమైపోయింది. మంచి ఎడ్యుకేషన్ కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నర్సరీకే లక్షలు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్థికంగా వెనకబడిన వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రమాదకర రూపాన్ని సంతరించుకుంటుంది. ఇందుకు ఈ ఘటనే ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆటో డ్రైవర్ అశోక్ గంగ్వార్ కూతురు ప్రైవేట్ స్కూల్‌లో చదువుతుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన ఫీజు కట్టలేకపోయే సరికి.. పరీక్షకు అనుమతించమని తేల్చింది యాజమాన్యం. ప్రిన్సిపల్‌ను ఎంత వేడుకున్న ససేమిరా అనడం.. తండ్రి అమాయకత్వం, ఆయనకు జరిగిన అవమానాన్ని చూసిన పాప భరించలేకపోయింది. బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 2023 మార్చిలో ఈ ఘటన జరగ్గా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాప డాక్టర్ కావాలని కలలు కన్నా.. అవమానం ఆమెను ముంచెత్తింది. ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.






