ఏడుస్తూ.. 52 సార్లు సారీ చెప్పినా వినని ప్రిన్సిపల్‌.. మూడో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-07 14:11:39  IST  )

విద్యార్థులు ఆత్మహత్య రేటు పెరిగిపోతుంది. స్కూల్‌లో ఎదుర్కొంటున్న అవమానాలు, సెన్సిటివ్ మెంటాలిటీ ఇందుకు కారణమవుతుంది. తాజాగా ఎనిమిదో తరగతి విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పూర్తి వివరాలు చూద్దాం.

ఏడుస్తూ.. 52 సార్లు సారీ చెప్పినా వినని ప్రిన్సిపల్‌.. మూడో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులు ఆత్మహత్య రేటు పెరిగిపోతుంది. స్కూల్‌లో ఎదుర్కొంటున్న అవమానాలు, సెన్సిటివ్ మెంటాలిటీ ఇందుకు కారణమవుతుంది. తాజాగా ఎనిమిదో తరగతి విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పూర్తి వివరాలు చూద్దాం.

మధ్యప్రదేశ్ రత్తాంలోని బోధి ఇంటర్నేషల్ స్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి రిషాన్ కటారియా నేషనల్ లెవ్ స్కేటింగ్ ఛాంపియన్. కాగా తాజాగా క్లాస్ రూమ్‌లో ఫోన్ యూజ్ చేస్తూ పట్టుబడ్డాడు. రీల్స్ చూస్తున్నాడని.. టీచర్ తిట్టడమే కాదు ప్రిన్సిపల్‌కు కూడా కంప్లయింట్ చేసింది. దీంతో ప్రిన్సిపల్‌ రూమ్‌కు పిలిచి తిట్టడంతో.. ఏడుస్తూ.. 52సార్లు సారీ చెప్పిన బాలుడు.. స్కూల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కాళ్లు, వెన్నెముక, దవడలో ఫ్రాక్చర్స్ అయినట్లు తెలిపారు వైద్యులు. సస్పెన్షన్, ఎక్స్‌పెల్షన్, స్కేటింగ్ మెడల్స్ లాగేసుకుంటామని.. కెరీర్ నాశనం చేస్తామని బెదిరించడమే పిల్లాడి ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది.

Click For Twitter Post ....

Next Story