- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రిన్సిపల్ బెదిరించాడని.. పాఠశాల భవనం పైనుంచి దూకిన విద్యార్థి!
చిన్న చిన్న విషయాలకే స్కూల్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పాఠశాలల్లోనే భవనాలపై నుండి కిందకి దూకుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: చిన్న చిన్న విషయాలకే స్కూల్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పాఠశాలల్లోనే భవనాలపై నుండి కిందకి దూకుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు దేశంలో రెండు చోటు చేసుకున్నాయి. కాగా తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్-రత్లాంలో డోంగ్రే నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ప్రిన్సిపల్ మందలించాడని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. స్కూల్ కు ఫోన్ తీసుకువచ్చి వీడియోలు తీయడంతో యాజమాన్యం అతడిని మందలించింది.
ప్రిన్సిపాల్ తన గదికి పిలిపించుకుని హెచ్చరించాడు. దీంతో 52 సార్లు విద్యార్థి సారీ చెప్పినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మరోవైపు ప్రిన్సిపల్ కెరీర్ నాశనం చేస్తాను అంటూ బెదిరించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సీసీ టీవీ ఆధారంగా విద్యార్థి ప్రిన్సిపల్ గది నుండి బయటకు వచ్చిన వెంటనే దూకేశాడు. దీంతో వెంటనే విద్యార్థులు, టీచర్లు అక్కడకు చేరుకున్నారు. అతడని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని ప్రస్తుతం కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆత్మహత్యయత్నం చేసిన విద్యార్థి జాతీయస్థాయి స్కేటింగ్ క్రీడాకారుడు అని సమాచారం. VIDEO






