- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన ములుగు మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, ములుగు : రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన ములుగు మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రంగా క్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అడవిమజీద్ గ్రామానికి చెందిన ఎండీ అజీమోద్దీన్ (19) గురువారం అడవిమజీద్ నుంచి జగదేవపూర్ కు బైక్ పై వెళ్తన్నాడు. ఈ క్రమంలో ములుగులోని గురుకుల పాఠశాల వద్ద రాజీవ్ రహదారిపై వెనకాల నుంచి అతివేగంతో వచ్చిన లారీ అజీమోద్దీన్ బైక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంగకృష్ణ తెలిపారు.
Next Story






