వాట‌ర్ అనుకొని కెమికల్ లిక్విడ్ తాగి విద్యార్థి మృతి

by Ratna Kumari |

దిశ, మిర్యాలగూడ : ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో

వాట‌ర్ అనుకొని కెమికల్ లిక్విడ్ తాగి విద్యార్థి మృతి
X

దిశ, మిర్యాలగూడ : ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన గణేష్ గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణ సాయి హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ టాబ్లెట్ వేసుకునేందుకు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వాటర్ క్యాన్ వద్దకు వెళ్లగా.. నీళ్లు లేకపోవడంతో పక్కనే ఉన్న క్యాన్ లో ఉన్న లాబరేటరీ కెమికల్ లిక్విడ్ ను మంచినీరు అనుకోని తాగాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో గణేష్ మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు కుటుంబ సభ్యులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story