హాస్టల్‌కి వెళ్లామన్నందుకు విద్యార్థి బలవన్మరణం..

by Chintha Aamani |   (  Updated:2025-07-15 10:45:48  IST  )

పదవ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

హాస్టల్‌కి వెళ్లామన్నందుకు విద్యార్థి బలవన్మరణం..
X

దిశ,పరిగి : పదవ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పరిగి మండలం యాబాజిగూడ గ్రామానికి చెందిన రంగ గళ్ళ పద్మమ్మ ను చిగురాల పల్లి గ్రామానికి చెందిన జంగయ్య తో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడ సంతానం. కొన్నేళ్ళకి భర్త జంగయ్య విద్యుత్ షాక్ తో చనిపోయాడు. దీంతో పద్మమ్మ తన ముగ్గురు పిల్లలపై కలిసి తల్లి గారి ఇల్లు అయినా యాబాజీ గూడెం లోనే ఉంటుంది. పద్మమ్మ రెండో కూతురు నవేంద్ర(15) పాలమాకుల కస్తూర్బా బాలికల పాఠశాలలో చదువుతోంది. పాఠశాలకు వెళ్ళనని తిరిగి ఈ మధ్యనే ఇంటికి వచ్చింది. ఈనెల 14వ తేదీ సోమవారం కుటుంబీకులు బంధువుల దిన వారాలకు వెళ్లారు.

తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి నవేంద్ర ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం నవేంద్ర పదవ తరగతి. కొంతకాలంగా స్కూల్ కి వెళ్లాను అని నవేంద్ర తల్లితో మారం చేసేది. తల్లి చదువుకోవాలి అంటూ నచ్చజెప్పి తిరిగి హాస్టల్ కి పంపించేది. హాస్టల్ నుంచి పదే పదే ఇంటికి ఎందుకు వస్తుందని తల్లి ఆరా తీసింది. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి నవేంద్ర ను చూసేందుకు తరచూ హాస్టల్ కు వచ్చేవాడని తెలుసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మ గళ్ళ నవీన్ హాస్టల్ కి తరచూ నవేంద్రను చూసేందుకు వచ్చేవాడని అందుకే హాస్టల్ కు వెళ్లానని మొండికేస్తూ చివరకు ఇలా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబీకులు పరిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Next Story