- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాసిడ్ తాగి విద్యార్థిని ఆత్మ హత్యాయత్నం
నల్లగొండ జిల్లాకేంద్రంలో ఓ విద్యార్థిని సోమవారం బాత్రూంలో వాడే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

దిశ, నల్లగొండ క్రైం : నల్లగొండ జిల్లాకేంద్రంలో ఓ విద్యార్థిని సోమవారం బాత్రూంలో వాడే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అనుములు మండలంలోని హజారిగూడెం గ్రామానికి చెంది ఎర్రబోయిన హేమ శ్రీ (19) బీసీ హాస్టల్లో ఉంటూ ఎన్జీ కాలేజీలో డిగ్రీ సెంకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం బాత్రూంలో వాడే యాసిడ్ తాగింది. తోటి విద్యార్థినులు గమనించి, హాస్టల్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన తర్వాత, ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హేమ శ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అనారోగ్య సమస్యలతోనే విద్యార్థిని ఈ ఘటనకు పాల్పడిందని అనుకుంటున్నా.. పోలీసులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి, బీసీ సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట ఆందోళన చేశారు.






