హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతున్న గ్రూపుల మధ్య స్ట్రీట్ ఫైట్స్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-24 04:31:00  IST  )

హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా స్ట్రీట్ ఫైట్స్ చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో ఈ ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతున్న గ్రూపుల మధ్య స్ట్రీట్ ఫైట్స్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా స్ట్రీట్ ఫైట్స్ చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో ఈ ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. గత వారం టోలీచౌకీ, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన స్ట్రీట్ ఫైట్స్‌తో స్థానికులు ఆందోళనకు గురైన విషయం తెలిసిందే. ఇదే తరహాలో తాజాగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ సంభవించడంతో పరిస్థితులు తీవ్రతరం అయ్యాయి.

తక్కువ వ్యవధిలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు సమర్థంగా స్పందించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో స్ట్రీట్ ఫైట్స్ పెరుగుతున్నా, పహారా వ్యవస్థ బలోపేతం చేయడంలో పోలీసులు అలసత్వం చూపుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక శాంతిభద్రతలకు భంగం కలిగించే ఈ ఘటనలను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనలపై ఇప్పటికే పోలీస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

Next Story