వైద్యం చేస్తానని ఉంగరం చోరీ

by Sridhar Babu |
వైద్యం చేస్తానని ఉంగరం చోరీ
X

దిశ,గంభీరావుపేట : వైద్యం చేస్తానని ఉంగరం చోరీ చేసిన నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్​ చేశారు. గంభీరావుపేట ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం నర్మల గ్రామానికి చెందిన గుండెల్లి అమృతలాల్ అనే వ్యక్తి కి ఎలుక కరిచింది. దాంతో చెట్ల మందు వేయించుకునేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు వచ్చాడు.

అతడిని గమనించిన గుర్తుతెలియని వ్యక్తి తనకు వైద్యం తెలుసని నమ్మపలికి బట్టలు మొత్తం విప్పి ఆరు గ్రాముల బంగారు ఉంగరాన్ని దొంగిలించాడు. దాంతో బాధితుడు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే దొంగతనానికి పాల్పడిన దమ్మన్నపేటకు చెందిన దండగుల సాయిలును అరెస్టు చేశారు. అలాగే చోరీ చేసిన ఉంగరాన్ని కొనుగోలు చేసిన గంభీరావుపేట గ్రామంలోని అల్లపల్లి నరేష్ ను కూడా రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed