‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు.. మరో ఇద్దరు డాక్టర్లు అరెస్ట్

by Kema Shiva Kumar |

‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు (‘Srishti’ Fertility Case)లో పోలీసుల దర్యాప్తు లోతుగా కొనసాగుతోంది.

‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు.. మరో ఇద్దరు డాక్టర్లు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు (‘Srishti’ Fertility Case)లో పోలీసుల దర్యాప్తు లోతుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Namrata)తో సంబంధాలు కలిగి ఉన్న విశాఖకు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. వారిలో డాక్టర్ రమ్య (Ramya)తో పాటు కేజీహెచ్‌ (KGH)లో అనస్థీషియా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రవి (Ravi) ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Doctor Namrata)తో సహా మొత్తం 26 మందిని అరెస్ట్ కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 28కి చేరింది.

సరోగసి ముసుగులో ఇప్పటి వరకు నమ్రత సుమారు 50 మంది బాధితుల దగ్గర రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా దర్యాప్తులో. అదేవిధంగా మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల నుంచి 18 మంది శిశువులు సేకరించినట్లుగా తేలింది. ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభాలకు గురిచేసి వారి నుంచి శిశువులను రూ.5 లక్షలకు విక్రయించి తన వద్దకు వచ్చిన క్లయింట్లకు రూ.50 లక్షలకు డాక్టర్‌ నమ్రత విక్రయించినట్లుగా తెలింది. ఇప్పటి వరకు 80 మంది పిల్లలను అమ్మినట్లుగా బట్టబయలైంది. దీంతో పోలీసులు ఇటీవల డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ‘సృష్టి’ కేసులో తల్లులను గుర్తించి శిశువులను తిరిగి వారికి అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story