- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ చైతన్య విద్యార్థి ఉరి వేసుకుని మృతి
శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థి నితీష్ అప్పం (16) మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు.

పదో తరగతి పరీక్షల వేళ విషాదం
శ్రీ చైతన్య విద్యార్థి ఉరి వేసుకుని మృతి
దిశ, లక్ష్మిదేవిపల్లి : పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో కొత్తగూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థి నితీష్ అప్పం (16) మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అశోక్‌నగర్ మామిడి తోట ప్రాంతానికి చెందిన నితీష్ తల్లి మౌనిక టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు సమాచారం. ఈ కుటుంబం టేకులపల్లి మండలం కోయగూడెం ప్రాంతానికి చెందినదిగా తెలిసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పాఠశాలలో ఉపాధ్యాయుల వైఖరి కారణంగా బాలుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని తెలిపారు. ఈ కారణాలతో మనస్థాపానికి గురైన నితీష్ ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు, ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






