దారుణం.. పీరియడ్స్ కారణంగా సెక్స్‌కు నిరాకరించినందుకు.. నవ వధువును క్రూరంగా హతమార్చిన భర్త..

by Sujitha Rachapalli |

దక్షిణ కొరియాలో దారుణం చోటు చేసుకుంది. పీరియడ్స్ కారణంగా సెక్స్‌కు నిరాకరించినందుకు నవ వధువును దారుణంగా హత మార్చాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. యూ హై యంగ్ అనే మహిళ పైలేట్స్ స్టూడియో యజమాని అయిన సియోను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

దారుణం.. పీరియడ్స్ కారణంగా సెక్స్‌కు నిరాకరించినందుకు.. నవ వధువును క్రూరంగా హతమార్చిన భర్త..
X

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ కొరియాలో దారుణం చోటు చేసుకుంది. పీరియడ్స్ కారణంగా సెక్స్‌కు నిరాకరించినందుకు నవ వధువును దారుణంగా హత మార్చాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. యూ హై యంగ్ అనే మహిళ పైలేట్స్ స్టూడియో యజమాని అయిన సియోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పది నెలల ప్రేమ బంధం తర్వాత కుటుంబాలను ఒప్పించి గతేడాది డిసెంబర్‌లో ఫైనల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమెకు భర్త ఒక సెక్స్ అబ్సెస్డ్ మానియాక్ అని తెలిసింది. శృంగారం కోసం దారుణంగా హింసించడం, తీవ్రమైన లైంగిక ఒత్తిడితో విసిగిపోయింది. తన మరణానికి ముందు ఈ విషయాన్ని తన స్నేహితులతోనూ చర్చించింది. పీరియడ్స్‌‌లో ఉన్నప్పుడు సెక్స్‌కు నిరాకరిస్తే కొట్టినట్లు కూడా చెప్పింది. ఈ కారణంగా ఓ సారి గర్భస్రావం కూడా అయినట్లు.. అతన్ని చేసుకున్నందుకు బాధపడుతున్నట్లు ఫ్రెండ్స్‌కు తెలిపింది.

మార్చి 14న హనీమూన్ వెళ్లిన యూ, సియో హ్యాపీగానే ఉన్నారు. కానీ లైంగికంగా కలిసేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన సియో.. మద్యం మత్తులో ఆమె గొంతు నొక్కి చంపేశాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేసి.. తన భార్య చనిపోయినట్లు అనిపిస్తుందని, భయంగా ఉందని చెప్పాడు. పారామెడిక్స్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తే.. అప్పటికే ఆమె శరీరం గట్టిపడి, చల్లబడి ఉన్నట్లు గుర్తించారు. చనిపోయి చాలా గంటలు అయినట్లు నిర్ధారించారు. ముఖంపై గాయాలు, గొంతు బిగించిన గుర్తులు అనుమానాస్పదంగా ఉండటంతో సియోను విచారించారు పోలీసులు. ముందుగా నిద్రమాత్రలు వాడిందని, తను లేపకుండానే ఆఫీసుకు వెళ్లానని చెప్పినా.. ఆ తర్వాత లైంగిక డిమాండ్లు తిరస్కరించినందుకు కోపంతో గొంతు పిసికి చంపినట్లు అంగీకరించాడు. పక్కనే ఉన్నవారు కూడా రాత్రంతా శబ్దాలు వినిపించాయని, మహిళ ఇబ్బంది పడినట్లు తెలుస్తుందని తెలిపారు. దక్షిణ కొరియా చట్టం ప్రకారం.. ప్రీట్రయల్ డిటెన్షన్ ఆరు నెలలకు పరిమితం కాగా సెప్టెంబర్‌లో విచారణ పూర్తి కావాల్సి ఉంది. ఈ క్రమంలో అన్‌ఆన్సర్డ్ క్వశ్చన్స్ ప్రోగ్రాంలో ఈ కేసు గురించి టెలికాస్ట్ కాగా గృహహింస, వైవాహిక అత్యాచారం, సంబంధాల్లో మహిళపై ఒత్తిడి గురించి హైలెట్ చేసింది. ఈ హత్య సహజసిద్ధమైన కోపంతోనే జరిగిందా లేక భార్యపై నియంత్రణ, సెక్స్‌పై ఆసక్తి కారణంగానా అని ప్రశ్నించింది.

Next Story