కలియుగం.. రూ. 40 కోసం తల్లిని హతమార్చిన కొడుకు..

by Sujitha Rachapalli |

* తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు * రూ. 40 కోసం ఇంత దారుణానికి ఒడిగట్టిన ఘటన * గ్రామస్తులంతా కలిసి తగిన గుణపాఠం.. పోలీసుల ఎంట్రీతో

కలియుగం.. రూ. 40 కోసం తల్లిని హతమార్చిన కొడుకు..
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌‌ జిల్లా కాసిమ్‌గవా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 65ఏళ్ల వృద్ధురాలైన తల్లిని నలభై రూపాయల కోసం దారుణంగా హత మార్చాడు కొడుకు. రాజారామ్ తాగిన మత్తులోనే ఇంటికి వచ్చాడు. మరింత తాగేందుకు తల్లి రాజేశ్వరిని డబ్బులు అడిగాడు. కానీ ఆమె ఇవ్వకపోవడంతో తిట్టడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొట్టడంతో.. వృద్ధురాలు లోపలికి వెళ్లి భయంతో తలుపేసుకుంది. అయినా కూడా వదలని కొడుకు.. తలుపు పగలగొట్టి జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చాడు. ఇటుకతో పలుమార్లు తలపై బాది హతమార్చాడు. దీంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించినా.. గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Next Story