- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లిని క్రూరంగా హత్య చేసిన కొడుకు.. శవంతో 72 గంటలు..
by Sujitha Rachapalli |
మధ్యప్రదేశ్ షాహ్‌దోల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిని క్రూరంగా హత్య చేశాడు కొడుకు. బ్యౌహారీ పీఎస్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 4న తల్లి

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ షాహ్‌దోల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిని క్రూరంగా హత్య చేశాడు కొడుకు. బ్యౌహారీ పీఎస్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 4న తల్లి, కొడుకును చదువు గురించి తిట్టింది. దీంతో కోపంతో లాఠీతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత జరిగిన విషయం బయటపడకుండా ఉండేందుకు 72 గంటలు తల్లి శవంతోనే ఉండిపోయాడు. మూడు రోజులు ఇంట్లోనే వంట చేసుకుని తల్లి శవం పక్కనే హాయిగా భోజనం చేశాడు. ముందుగా పక్కింటి వారు తల్లీకొడుకులు కలిసి ఊరుకు వెళ్లారని అనుకున్నారు. కానీ మూడు రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం కొడుకును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Next Story






