- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీ.. చీ.. కన్న కొడుకువేనా? తల్లిపై ప్లాన్ చేసి స్నేహితులతో కలిసి దారుణం
సమాజంలో మానవత్వం రోజు రోజుకు చచ్చిపోతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో మానవత్వం రోజు రోజుకు చచ్చిపోతోంది. డబ్బు కోసం అయిన వారిని కాని వారిని ఖతం పట్టిస్తున్నారు. ప్రియుడితో గడిపేందుకు అడ్డుగా ఉన్నాడని భావించి ఇన్సూరెన్స్ చేయించి మరీ కన్నకొడుకును కాటికి పంపించిన తల్లి ఘటన మరువక ముందే తాజాగా ఓ కొడుకు దుర్మార్గం బట్టబయలైంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న కొడుకు దుర్మార్గాన్ని పసిగట్టలేకపోయిన ఓ అమాయకపు తల్లి తన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలు సభ్యసమాజంలో బంధాల విలువలు మేరకు దిగజారుతున్నాయో వివరిస్తోంది. ప్రియుడి కోసం కొడుకును చంపేసిన ఘటన యూపీలో జరగగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం (Insurance fraud) స్నేహితులతో కలిసి తల్లిని అంతం చేసిన ఘటన చైనాలో (China) జరిగింది.
అమ్మా రోడ్డు పక్కన నిల్చో..
చైనాలో లూ అనే (23) వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం తన స్నేహితులతో కలిసి తన తల్లిని హత్య చేశాడు. అంతకు ముందు లూ తల్లి షూ 2023లో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి 45,000 యూఎస్ డాలర్ల విలువైన బీమా మొత్తాన్ని పొందింది. ఇది గమనించిన లూ అతడి స్నేహితులైన యాంగ్, చెంగ్ కలిసి ఇన్సూరెన్స్ ల ద్వారా ఈజీగా మనీ సంపాదించవచ్చని గ్రహించారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తొలుత తన తల్లి కళ్లలో పొడిచి తద్వారా వచ్చే డబ్బులు తీసుకోవాలని భావించాడు. కానీ ఆ పథకం విఫలం కావడంతో లూ ఈ పథకాన్ని తన తండ్రిపై ప్రయోగించాడు. తండ్రి కళ్లలో వెదురు కర్రతో పొడిచి 1300 యూవాన్ల బీమా నష్టపరిహారం పొందగలిగాడు. ఆ తర్వాత అతడి ఆలోచనలు తన తల్లిపై పడ్డాయి. వెంటనే తన తల్లిని ఓ గ్రామీణ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ రోడ్డు పక్కన నిల్చోమని చెప్పి పక్కకు వెళ్లాడు. ఆ వెంటనే లూ స్నేహితులు ఆ మహిళను కారుతో ఢీ కొట్టి చంపేశారు.
ఈ ఘటన తర్వాత బీమా పరిహారం తీసుకుని జల్సాలు చేశారు. అయితే ఆ డబ్బు అయిపోగానే లూ తాతను చంపేద్దామని అతని స్నేహితులు సూచించారు. అయితే తాత తనను పెంచిన వ్యక్తి కావడంతో లూ అందుకు అంగీకరించలేదని చైనా మీడియా పేర్కొంది. కాగా తన తల్లి విషయంలో లూ చెప్పిన కారణాలకు ఘటన జరిగిన తీరులో పలు అంశాలు సరిపోవడం లేదని గ్రహించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా కన్నకొడుకు దుర్మార్గం బట్టబయలైంది. దీంతో నిందితులు లూ అతని స్నేహితులకు తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని తైజౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు (Taizhou Intermediate People's Court) మరణ శిక్ష విధించింది. మా అమ్మను చంపి బీమా పరిహారం పొందితే మా కుటుంబ జీవితం బాగుపడుతుందని తన స్నేహితుడు యాంగ్ నాకు చెప్పాడని అందువల్లే తాను మా అమ్మను చంపడానికి అంగీకరించానని లూ పోలీసులకు చెప్పినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటన మనకు పొరుగు దేశంలో జరిగినప్పటికీ ఇన్సూరెన్స్ స్కామ్ లో మన దేశంలోనూ నిత్యం వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ తాజా ఘటన హెచ్చరిస్తోంది.






