పథకం ప్రకారం అల్లుడి హత్య..?

by Nallavelli.Anjaneyulu |

దిశ, కొండపాక: వరుసకు మేనమామ నే అల్లుడుని పథకం ప్రకారం కారుతో ఢీ కొట్టి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించిన సంఘటన సిద్దిపేట జిల్లా లో చోటుచేసుకుంది. మృతుని తల్లి ఖాదియా,

పథకం ప్రకారం అల్లుడి హత్య..?
X

దిశ, కొండపాక: వరుసకు మేనమామ నే అల్లుడుని పథకం ప్రకారం కారుతో ఢీ కొట్టి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించిన సంఘటన సిద్దిపేట జిల్లా లో చోటుచేసుకుంది. మృతుని తల్లి ఖాదియా, కుకునూర్ పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవ్ పూర్ మండలం చాట్లాప్లలి గ్రామానికి చెందిన ఖదీర్ భార్యతో మెనల్లుడు షాహిద్(25) చనువుగా ఉంటున్నాడని అనుమానంతో, ఖదీర్ పలుమార్లు గొడవ పెట్టకున్నాడని . వారం క్రితమే ఖదీర్... షాహిద్ ని చంపేస్తానని తమతో గొడవ పడ్డాడని మృతుని తల్లి ఖాదీయ తెలిపారు. ఈ క్రమంలోనే చాట్లపల్లి గ్రామం నుండి హెయిర్ కటింగ్ చేపించుకుందామని షాహిద్ బైక్ మీద వస్తుండగా కుకునూర్ పల్లి మండలం చిన్న కిష్టాపూర్ గ్రామ సరిహద్దులో కారుతో షాహిద్ బైక్ ని డీ కోట్టగా, గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే షాహిద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మేనమామ ఖదీర్ పథకం ప్రకారం కారుతో ఢీ కొట్టి చంపేశాడని తల్లి కన్నీరు మున్నీరయింది. తన కొడుకుని హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. మృతుని తల్లి ఖాదియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని అక్రమ సంబంధమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story