నడిరోడ్డుపై భర్తను హింసించి.. బలవంతంగా విషం తాగించి.. చంపిన భార్య ఫ్యామిలీ(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-09 12:25:09  IST  )

ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇమ్టౌరీ గ్రామానికి చెందిన సోనూతో భార్యకు తిండి విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆమె తన కుటుంబ సభ్యులకు దీని గురించి చెప్పగా.. అంతా కలిసి సోనూపై ఎటాక్ చేశారు. రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నుతూ..

నడిరోడ్డుపై భర్తను హింసించి.. బలవంతంగా విషం తాగించి.. చంపిన భార్య ఫ్యామిలీ(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇమ్టౌరీ గ్రామానికి చెందిన సోనూతో భార్యకు తిండి విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆమె తన కుటుంబ సభ్యులకు దీని గురించి చెప్పగా.. అంతా కలిసి సోనూపై ఎటాక్ చేశారు. రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నుతూ.. గుద్దుతూ.. కర్రలతో కొడుతూ.. బల్లలు విసురుతూ దారుణంగా హింసించారు. ఆ తర్వాత బలవంతంగా విషం తాగించారు. దీంతో సోనూ బంధువులు అతన్ని హాస్పిటల్‌కు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని మీరట్‌ హాస్పిటల్‌కు రిఫర్ చేయగా.. చికిత్స పొందుతూనే మరణించాడు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా సోనూ బంధువుల ఫిర్యాదుతో భార్యతోపాటు ఏడుగురిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. సోనూ విషం తాగినట్లు నిర్ధారణ అయిందని.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Next Story