- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు ఆరుగురు మృతి
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ముగ్గురు రైతులు మృతిచెందారు. ఈ ఘటన నిర్మల్(Nirmal) జిల్లా పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్‌లో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ముగ్గురు రైతులు మృతిచెందారు. ఈ ఘటన నిర్మల్(Nirmal) జిల్లా పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్‌లో చోటుచేసుకుంది. పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడింది. దీంతో రైతు దంపతులు ఎల్లయ్య, ఎల్లవ్వలతో పాటు రైతు కూలీ వెంకటి కూడా అక్కడిక్కడే మృతిచెందారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. కాగా, అంతకుముందు ఇలాంటి ఘటనే జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లాలో కూడా చోటుచేసుకుంది. పిడుగుపడి ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐజ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. దీంతో ఒకరోజు పిడుగుపాటుకు గురై ఆరుగురు మృతి(Six People Dead)చెందడం కలకలం రేపింది.
Next Story






