బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుణ్ణి చంపిన సిస్టర్స్

by Muthe.Rajitha |

బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న యువకుణ్ణి అక్కాచెల్లెళ్లు హత్య చేసిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.

బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుణ్ణి చంపిన సిస్టర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న యువకుణ్ణి అక్కాచెల్లెళ్లు హత్య చేసిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్‌ పోలీసుల వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్‌ హైదరాబాద్‌లో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుండగా, అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం ఆమె అక్కతోనూ పరిచయం పెంచుకుని సంబంధం కొనసాగించాడు. ఇటీవల ఆ యువతికి పెళ్లి సంబంధం రావడంతో మహేందర్‌ తన సెల్‌ఫోన్‌లో ఉన్న ఆమె న్యూడ్ వీడియోలు చూపించి, సంబంధాన్ని చెడగొట్టడమే కాకుండా బ్లాక్‌మెయిల్‌ కు దిగాడు. దీంతో శుక్రవారం యువతి మహేందర్‌కు ఫోన్‌ చేసి తమ గ్రామానికి పిలిపించి, కళ్లలో కారం చల్లి కర్రలతో దాడి చేశారు.

అక్కడే ఉన్న ఆ యువతుల బంధువులు కూడా కర్రలతో తీవ్రంగా కొట్టడంతో మహేందర్‌ తలకు తీవ్ర గాయాలై పడిపోయాడు. స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story