- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ.. ఛీ.. భర్తలను మార్చుకున్న అక్కాచెల్లెళ్లు.. ఇదేం పాడుపని..
ఉత్తరప్రదేశ్ లలిత్ పూర్ జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు భర్తలను మార్చుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. పాలి పీఎస్ పరిధికి చెందిన ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లకు పదేళ్ల క్రితం పెళ్లి చేశాడు

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లలిత్ పూర్ జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు భర్తలను మార్చుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. పాలి పీఎస్ పరిధికి చెందిన ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లకు పదేళ్ల క్రితం పెళ్లి చేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారికి ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. వీరి సంసారం సుఖంగా సాగినా.. ఆరు నెలల క్రితం చిన్న కుమార్తె అక్క భర్తతో ప్రేమలో పడింది.
ఇది కాస్త గాఢంగా మారి ఓ రోజు ఇద్దరూ పారిపోయారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. దీంతో అక్క, తండ్రి, చెల్లి భర్త కలిసి వారి కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ దొరకకపోవడంతో అక్క, చెల్లి భర్తను పెళ్లి చేసుకుంది. మొత్తానికి అందరూ కాంప్రమైజ్ అయి పిల్లలను కూడా మార్చుకున్నారు. అక్క పిల్లలను చెల్లెలికి ఇవ్వగా.. చెల్లెలు తన పిల్లలను అక్కకు ఇచ్చేసింది. దీంతో విసిగిపోయిన తండ్రి అందరిని ఇంటి నుంచి తరిమికొట్టాడు. బంధాలు తెంచేసుకుంటున్నట్లు ప్రకటించాడు.






