బాలాపూర్‌లో దారుణం...ఇద్దరు యువతులు అనుమానాస్పద మృతి

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బాలాపూర్‌లో ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

బాలాపూర్‌లో దారుణం...ఇద్దరు యువతులు అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బాలాపూర్‌లో ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వినీల‌, అఖిల అనే ఇద్ద‌రు అక్కా చెల్లెల్లు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేశారు. యువ‌తుల్లో అక్క వినీల ఓ యువ‌కుడిని ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుండి వెళ్లిపోయిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ త‌ర‌వాత కులాంత‌ర వివాహం వ‌ద్ద‌ని హెచ్చ‌రించి కుటుంబ స‌భ్యులు ఇంటికి తీసుకువ‌చ్చినట్టు చెబుతున్నారు. ఆ త‌ర‌వాత నుండి అక్కాచెల్లెల్ల ప్ర‌వ‌ర్త‌నలో మార్పు వ‌చ్చిన‌ట్టు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యువ‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా? లేదా ఎవ‌రైనా హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించారా అనే దిశ‌గా ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story