- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య..!
దిశ, మందమర్రి : గడ్డి మందు తాగి సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, మందమర్రి : గడ్డి మందు తాగి సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రామకృష్ణాపూర్ గ్రామానికి కి చెందిన మెంగని శ్రీకాంత్ (31), సింగరేణి ఉద్యోగి. 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే గత నాలుగు సంవత్సరాలుగా భార్యా భర్తల మధ్య మనస్పార్థాలు చోటు చేసుకోవడంతో దాదాపు నెల రోజుల క్రితం ఇరువురు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి శ్రీకాంత్ తీవ్రమైన మానసిక కృంగు బాటుతో బాధపడుతున్నారు. ఈనెల 01వ తేదీన రాత్రి సమయంలో వ్యవసాయ పనుల కోసం తెచ్చి ఉంచుకున్న గడ్డి మందు (Pesticide) తాగాడు. బంధువులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రోజు రాత్రి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని బావ అప్పని ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.






