అదనపు కట్నం కోసం ఎస్సై వేధింపులు..భార్య సంచలన ఆరోపణలు

by Ajay Maddhiboyina |

క‌ట్నం తీసుకుంటే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ఓ పోలీసు అధికారే అద‌న‌పు క‌ట్నం కోసం భార్య‌ను వేధింపుల‌కు గురి చేశాడు.

అదనపు కట్నం కోసం ఎస్సై వేధింపులు..భార్య సంచలన ఆరోపణలు
X

దిశ‌, వెబ్ డెస్క్: క‌ట్నం తీసుకుంటే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ఓ పోలీసు అధికారే అద‌న‌పు క‌ట్నం కోసం భార్య‌ను వేధింపుల‌కు గురి చేశాడు. ఈ క్ర‌మంలోనే సెటిల్మెంట్ పేరుతో భార్య కుటుంబ స‌భ్యుల‌ను, బంధువుల‌ను పంచాయితీకి పిలిచి వారిపై దాడి చేయించాడు. ఈ ఘ‌ట‌న ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం చిల్ల‌క‌ల్లు గ్రామంలో చోటు చేసుకుంది. మ‌ధిర‌కు చెందిన రాజ్య‌ల‌త‌తో వేదాద్రి గ్రామానికి చెందిన చ‌ల్లా ప్ర‌వీణ్ కుమార్ కు ఏడాది క్రితం వివాహం జ‌రిగింది. చ‌ల్లా ప్ర‌వీణ్ కుమార్ బంజారాహిల్స్ క‌మాండ్ కంట్రోల్ ఎస్సైగా విధులు నిర్వ‌హిస్తున్నాడు.

పెళ్లి స‌మ‌యంలో ఇచ్చిన కట్నం కంటే త‌న‌కు అద‌నంగా క‌ట్నం కావాల‌ని భార్య‌ను వేధింపుల‌కు గురి చేశాడు. ఈ క్ర‌మంలో భార్యను ఇంటి నుండి నెల రోజుల క్రితం వెళ్ల‌గొట్ట‌గా సెటిల్మెంట్ కోసం అని ఓ ఫంక్ష‌న్ హాలుకు పిలిచి దాడి చేశారు. ఘ‌ట‌న‌పై ఎస్సై భార్య రాజ్య‌ల‌త మీడియాతో మాట్లాడుతూ... రూ.10 ల‌క్ష‌ల క‌ట్నం, 10 తులాల బంగారం, 3 ఎక‌రాల భూమి, ఒక డ‌బుల్ బెడ్రూం, ఒక ఫ్లాట్ ఇచ్చామ‌ని చెప్పారు. పెళ్లి జ‌రిగిన 2 నెల‌ల త‌ర‌వాత‌నే త‌న పేరిట 3 ఎక‌రాలు రిజిస్ట్రేష‌న్ చేయించ‌లేద‌ని గొడ‌వ‌కు దిగార‌న్నారు. త‌ర‌వాత త‌రచూ వేధిస్తూ ఉండేవాడ‌ని ఆరోపించారు. ఇప్పుడు సెటిల్మెంట్ పేరుతో పిలిచి వాళ్ల కుటుంబం అంతా క‌లిసి దాడి చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Next Story