- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ ఆత్మహత్య కేసులో పోలీసులకు లొంగిపోయిన ఎస్ఐ గోపాల్ బదానే
మహారాష్ట్ర రాష్ట్రంలోని సాతారా జిల్లాలోని ఫల్టన్ ఉప జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న యువ డాక్టర్ ఒక హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాష్ట్రంలోని సాతారా జిల్లాలోని ఫల్టన్ ఉప జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న యువ డాక్టర్ ఒక హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె చేతితో పాటు, బుక్ లో రాసిన సూసైడ్ నోట్లో, ఎస్ఐ గోపాల్ బదానేపై అత్యాచారం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ బంకర్‌పై మానసిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం డాక్టర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ గోపాల్ బదానే శనివారం రాత్రి ఫల్టన్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయాడు. అతనిపై అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణలు ఉండటంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. అలాగే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ బంకర్‌ను శనివారం ఉదయం పుణెలో అరెస్ట్ చేశారు. మృతురాలు 21 సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, సరైన చర్యలు తీసుకోలేదని ఆమె బంధువులు ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






