పల్లెవెలుగు బస్సులో షార్ట్‌ సర్ట్క్యూట్‌

by Gantepaka Srikanth |

పల్లెవెలుగు బస్సులో షార్ట్‌ సర్ట్క్యూట్‌

పల్లెవెలుగు బస్సులో షార్ట్‌ సర్ట్క్యూట్‌
X

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా చోటుచేసుకుంటున్న వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం, చేవెళ్ల బస్సు(RTC Bus) ప్రమాదంలో దాదాపు 38మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనల్ని మర్చిపోకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి(East Godavari) జిల్లా దేవరపల్లిలో పల్లెవెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. గురువారం మధ్యాహ్నం షార్ట్‌ సర్ట్క్యూట్‌(Short Circuit) కారణంగా ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కిందకి దింపారు. స్థానికుల సాయంతో బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలను ఆర్పివేశారు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story