మసీదుపై కాల్పులు.. 50 మంది మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-21 04:08:20  IST  )

దారుణ ఘటన వెలుగుచూసింది. ఉంగువాన్ మాంటా పట్టణంలో మసీదుపై కాల్పులు జరపటంతో 50 మందికి మృతిచెందారు.

మసీదుపై కాల్పులు.. 50 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నైజీరియాలోని (Nigeria) కాట్సినా రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మలుంఫాషి జిల్లాలోని ఉంగువాన్ మాంటా పట్టణంలో మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) ఓ మసీదుపై (mosque attack) ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 50 మందికి మృతిచెందగా, ముష్కరులు 60 మందికి పైగా బంధీలుగా చేసి తీసుకెళ్లారు. తెల్లవారుజామున మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా దుండగులు మోటారు సైకిళ్లపై వచ్చి ఈ దాడి చేశారని ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. అంతేకాదు పలు గ్రామాలపై కూడా దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ఇది ఉగ్రవాదుల పనేనని స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు.

కాగా, మలుంఫాషికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు అమీను ఇబ్రహీం దాడిపై స్పందించారు. ఇది తమ సమాజంపై జరిగిన అత్యంత క్రూరమైన దాడిగా పేర్కొన్నారు. ఇందులో కనీసం 30 మంది మరణించారని, 20 మంది సజీవ దహనం అయ్యారని అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే అనేక ఇళ్లు కూడా తగలబడిపోయాయని ఆయన చెప్పారు.

దుండగులు స్త్రీలను, బాలికలను ఈడ్చుకెళ్లిన భయానక దృశ్యాలను ప్రాణాలతో బయటపడినవారు వివరించారు. కాగా, వాయువ్య నైజీరియాలో ఇటీవలి కాలంలో గ్రామాలు, రహదారులను లక్ష్యంగా చేసుకుని స్థానికంగా బందిపోట్లు అని పిలువబడే సాయుధ ముఠాల దాడులు ఎక్కువయ్యాయి. వీళ్లు డబ్బు కోసం కిడ్నాప్, దోపిడీలకు పాల్పడతుంటారని అంటున్నారు. అయితే తాజాగా జరిగిన దాడిలో 50 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.


Next Story