- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిఫ్ట్ అడిగిన వ్యక్తి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. మృతుడిపై లైంగిక దాడి
హైదరాబాద్‌లో అర్ధరాత్రి జరిగిన మురళీ కృష్ణ(45) హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మహమ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, మణికంఠ, మరో 16ఏళ్ల బాలుడు మురళీ కృష్ణ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఎల్బీ నగర్‌లో అర్ధరాత్రి తరవాత లిఫ్ట్ అడిగిన మురళీ కృష్ణను కారు ఎక్కించుకున్న పోకిరీలు అతడిపై మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో అర్ధరాత్రి జరిగిన మురళీ కృష్ణ(45) హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మహమ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, మణికంఠ, మరో 16ఏళ్ల బాలుడు మురళీ కృష్ణ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఎల్బీ నగర్‌లో అర్ధరాత్రి తరవాత లిఫ్ట్ అడిగిన మురళీ కృష్ణను కారు ఎక్కించుకున్న పోకిరీలు అతడిపై మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. మురళీకృష్ణ సైతం మద్యం సేవించి ఉన్నట్టు విచారణలో తేలింది.
అతడితో గొడవ జరగటంతో నిందితులు సిగరెట్లతో కాలుస్తూ, పిడిగుద్దులు కురిపిస్తూ రెండు గంటలపాటు కారులో తిప్పినట్టు పోలీసులు గుర్తించారు. చివరకు నాచారం పారిశ్రామికవాడలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తమ వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్య చేసినట్టు తెలిపారు. ఇక ఈ కేసులో మరో సంచలన విషయాన్ని పోలీసులు తాజాగా బయటపెట్టారు. నిందితులు మురళీ కృష్ణపై కిరాతకంగా లైంగికదాడికి సైతం పాల్పడినట్టు చెబుతున్నారు. నిందితుల్లో మహమ్మద్ జునైద్ పై ఐదు నెలల క్రితమై పోక్సో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది.






