- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DELHI BABA: సెక్స్ టాయ్స్, పోర్న్ సీడీలు.. ఢిల్లీ బాబా ఇల్లంతా చండాలమే
ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. బాబా ముసుగులో చైతన్యానంద చేసిన లీలలు బయటపడుతుండటంతో పోలీసులే అవాక్కవుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. బాబా ముసుగులో చైతన్యానంద చేసిన లీలలు బయటపడుతుండటంతో పోలీసులే అవాక్కవుతున్నారు. అరెస్ట్ తరవాత ఢిల్లీలోని ఆయన గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా సెక్స్ టాయ్స్, పోర్న్ సీడీలను గుర్తించారు. అంతే కాకుండా గోడలపై ప్రధాని మోడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో ఫోటోలు ఉండగా అవి ఫేక్ అని గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ రోత బాబా శ్రీ శారదా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో 17 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు.
అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు పంపడమే కాకుండా పాస్ చేయాలంటే తనతో గడపాలని లేదంటే కాలేజీ నుండి బయటకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ యువతి మొదట ఫిర్యాదు చేయగా తరవాత మరికొందరు చైతన్యానంద వేధింపులపై ఫిర్యాదు చేశారు. వారంతా ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాబాను అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయిలకు పెట్టిన సందేశాలను సైతం గుర్తించారు. మరోవైపు దుబాయ్ షేక్ కు అమ్మాయి కావాలంటూ ఓ విద్యార్థినికి సందేశాలు పంపినట్టు అతడి చాటింగ్ లో ఉంది. దీంతో బాబా నెట్ వర్క్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో అమ్మాయిలను సప్లై చేశాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






