దారుణం.. ప్రియుడి ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు

by Naga Rani Yarlagadda |

ప్రియుడిపై కోపంతో రగిలిపోతున్న ప్రియురాలు.. అతను ఇంట్లో లేని సమయం చూసి కుటుంబం, ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.

దారుణం.. ప్రియుడి ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడిపై కోపంతో రగిలిపోతున్న ప్రియురాలు.. అతను ఇంట్లో లేని సమయం చూసి కుటుంబం, ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దారుణానికి కారణం వివాహేతర సంబంధమని తెలుస్తోంది. గ్రామానికి చెందిన ఆలంకుంట మల్లేశ్ కు, తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గ అనే యువతికి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రాగా.. తెనాలిలోనే రాజీ ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి ఫలించలేదు. దీంతో ఆగ్రహంతో ఉన్న దుర్గ.. ప్రియుడి కుటుంబాన్ని అంతమొందించాలనుకుంది.

సుద్ధపల్లిలో ఉన్న మల్లేశ్ ఇంటికి శనివారం రాత్రి వెళ్లి.. అతను ఇంట్లో లేని సమయంలో భార్య అర్చన, తల్లి పద్మ, కొడుకు అరుణ్, ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ క్రమంలో దుర్గపై కూడా పెట్రో పడటంతో ఆమెకు కూడా నిప్పంటుకుంటుంది. మంటలను ఆర్పేందుకు పరుగున వచ్చిన స్థానికుల్లో ఆరుగురికి కూడా మంటలంటుకుని తీవ్రగాయాలయ్యాయి. మొత్తం 10 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఆ ఇంటిని పరిశీలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story