రంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన.. రాత్రికి రాత్రే సమాధులు మాయం!

by Ajay Maddhiboyina |

రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రంలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు ఓ కుటుంబానికి చెందిన స‌మాధుల‌నే మాయం చేశారు. దాదాపు ఆరు స‌మాధుల‌ను ధ్వంసం చేసి అందులోని హ‌స్తిక‌ల‌ను సైతం ఎత్తుకుపోయారు.

రంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన.. రాత్రికి రాత్రే సమాధులు మాయం!
X

దిశ‌, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రంలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు ఓ కుటుంబానికి చెందిన స‌మాధుల‌నే మాయం చేశారు. దాదాపు ఆరు స‌మాధుల‌ను ధ్వంసం చేసి అందులోని హ‌స్తిక‌ల‌ను సైతం ఎత్తుకుపోయారు. మొద‌ట బాధిత కుటుంబం శంక‌ర‌య్య అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారికి త‌మ పొలాన్ని అమ్మేసింది. అయితే త‌మ పెద్ద‌ల‌ స‌మాధులు నిర్మించి ఉండ‌టంతో గుంట భూమి మిన‌హాయించి మిగితాది అమ్మేశారు.

ఆ భూమిని కొన్న వ్య‌క్తి ర‌వి అనే మ‌రో రియ‌ల్ వ్యాపారికి అమ్మేశాడు. కాగా ఇప్పుడు ఆ స‌మాధులు అడ్డుగా ఉన్నాయ‌ని రాత్రికి రాత్రే స‌మాధుల‌ను త‌వ్వించారు. వాటి నిర్మాణాల‌ను క‌నిపించ‌కుండా చేశారు. స‌మాధుల‌ను త‌వ్వ‌డంతో పాటు అందులోని హ‌స్తిక‌ల‌ను సైతం మాయం చేశారు. రాత్రికి రాత్రే ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. 24 ఏళ్ల నుండి ఆ స‌మాధులున్నాయ‌ని త‌మ భూమి త‌మ‌కు ఇప్పించాల‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. స‌మాధుల‌ను త‌వ్విన వ్య‌క్తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story