జగిత్యాలలో షాకింగ్ ఘటన..పెన్షన్ ఇప్పిస్తానని పుస్తెలతాడు కొట్టేసిన దొంగ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-31 12:57:20  IST  )

జగిత్యాల జిల్లా ధర్మపురిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పంచాయితీ కార్యదర్శిని అని చెప్పి ఓ దొంగ‌ మ‌హిళ మెడ‌లో పుస్తెల‌తాడు ఎత్తుకెళ్లాడు.

జగిత్యాలలో షాకింగ్ ఘటన..పెన్షన్ ఇప్పిస్తానని పుస్తెలతాడు కొట్టేసిన దొంగ
X

దిశ‌, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా ధర్మపురిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పంచాయితీ కార్యదర్శిని అని చెప్పి ఓ దొంగ‌ మ‌హిళ మెడ‌లో పుస్తెల‌తాడు ఎత్తుకెళ్లాడు. పోశ‌వ్వ అనే మ‌హిళ పెన్ష‌న్ కోస వెళుతుండ‌గా మ‌ధ్య‌లో ప‌రిచ‌య‌మైన వ్య‌క్తి తాను నేరెళ్ల పంచాయితీ కార్య‌ద‌ర్శిని అని చెప్పి నమ్మించాడు. పెన్ష‌న్ డ‌బ్బులు కావాలంటే జిరాక్స్ కావాల‌ని చెప్పాడ‌ని, ఓ మ‌హిళ పుస్తెలు మ‌ర్చిపోయివ‌చ్చిందని ఇస్తే ఫోటో దిగుతుంద‌ని చెప్పి మోసం చేశాడ‌ని బాధితురాలు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాను జిరాక్స్ కోసం వెళ్లి వ‌చ్చేస‌రికి పారిపోయాడని తెలిపింది. ఘ‌ట‌న‌పై బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. వీడియో

Next Story