ఐదుసార్లు తప్పించుకొని ఆరోసారి బలయ్యాడు..గద్వాల కేసులో షాకింగ్ విషయాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-24 03:23:25  IST  )

గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. తేజేశ్వర్‌ను చంపేందుకు అతడి భార్య ఐశ్వర్య ప్రియుడు బ్యాంకు మేనేజర్ ఐదుసార్లు విఫలయత్నం చేసినట్టు సమాచారం.

ఐదుసార్లు తప్పించుకొని ఆరోసారి బలయ్యాడు..గద్వాల కేసులో షాకింగ్ విషయాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. తేజేశ్వర్‌ను చంపేందుకు అతడి భార్య ఐశ్వర్య ప్రియుడు బ్యాంకు మేనేజర్ ఐదుసార్లు విఫలయత్నం చేసినట్టు సమాచారం. చివరికి ఆరోసారి పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్ తిరుమల రావుకు పెళ్లైనా పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను వివాహం చేసుకుంటానని తన భార్యకు చెప్పగా ఆమె నిరాకరించారు. ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతోనే ఐశ్వర్య తేజేశ్వర్‌ను వివాహం చేసుకుంది.

పెళ్లికి ముందు తేజేశ్వర్‌తో నిశ్చితార్థం రద్దు అవ్వడంతో ఐశ్వర్య ఇద్దరితో ప్రేమాయణం నడిపించింది. ఇక చివరికి తేజేశ్వర్‌ను వివాహం చేసుకున్నా బ్యాంకు మేనేజర్‌తో తన సంబంధాన్ని కొనసాగించింది. నీతోనే వచ్చేస్తానని బ్యాంకు మేనేజర్‌కు మాట ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తేజేశ్వర్ అడ్డు తొలగించుకునేందుకు ఐశ్వర్య ప్రియుడు తిరుమల రావు సుపారీ గ్యాంగ్‌కు రూ.75వేలు ఇచ్చాడు. భర్త లొకేషన్ ట్రేస్ చేసేందుకు ఐశ్వర్య అతడి బైక్‌కు జీపీఎస్ ట్రాకర్ అమర్చి లొకేషన్ సుపారీ గ్యాంగ్‌కు తెలియజేసింది.

ప్రైవేటు సర్వేయర్ కావడంతో ల్యాండ్ సర్వే పేరుతో హంతకులు తేజేశ్వర్‌ను కారు ఎక్కించుకున్నారు. ముందు సీటులో తేజేశ్వర్ కూర్చోగా గొంతుకోసి హత్య చేశారు. అనంతరం బాడీని తాళ్లతో కట్టి కవర్‌లో చుట్టేసి పాణ్యం సమీపంలోని గాలేరి నగర కాలువ దగ్గర పడేశారు. ఈ కేసులో పోలీసులు నింధితులను అదుపులోకి తీసుకున్నారు. మొదట తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అత్త సుజాతను అరెస్ట్ చేయగా తరవాత పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అతడి డ్రైవర్ మరియు హంతకుడు మనోజ్‌ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Next Story