గాఢమైన ముద్దుతో ప్రియుడిని ఏం చేసిందో తెలిస్తే షాక్..

by Disha Web Desk 16 |
గాఢమైన ముద్దుతో ప్రియుడిని ఏం చేసిందో తెలిస్తే షాక్..
X

దిశ,వెబ్‌డెస్క్: నిజమైన ప్రేమికులు ఇద్దరిలో ఎవరికీ ఏమైనా తట్టకోలేరు. కాస్తా దూరంగా ఉన్నా వెంటనే వెళ్లి చూడాలనుకుంటారు. కనీసం వీడియో కాల్.. మెసేజ్ అయినా చేయాలని ఆరాటపడుతుంటారు. వారి వాయిస్ వినే వరకు తపన పడుతుంటారు. ఇక వారు చాలా రోజుల తర్వాత కలిస్తే.. వెంటనే హగ్గులు, ముద్దుల్లో మునిగిపోతుంటారు. తమ మధ్య గాలి కూడా దూరనంతగా పెనవేసుకొని పోతారు. ఇలాగే ప్రేమను నటిస్తూ ఓ ప్రియురాలు ప్రేమికుడిని జైలులోనే మట్టుబెట్టింది. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ కేసులో టేనస్సీ జైలులో ఖైదీగా ఉన్న జాషు బ్రౌన్‌ను కలవడానికి అతడి ప్రియురాలు రాచెల్ డోలార్డ్ వెళ్లింది. జైలులోకి వెళ్లిన ఆమె ప్రియుడిని హగ్గుల్లో ముంచెత్తింది. ఆ తర్వాత కాసేపు ముచ్చటించింది. ఇద్దరి మధ్య చాలా గ్యాప్ రావడంతో ప్రియుడికి గాఢంగా ముద్దు ఇచ్చింది. లిఫ్ లాక్ కిస్ ఇచ్చి అతడిని మత్తులోకి దింపింది. అయితే ఆమె ఇచ్చిన ముద్దుతో ప్రియుడు చనిపోయాడు. దీంతో షాక్ తిన్న జైలు అధికారులు ప్రియుడు ఎలా చనిపోయాడని ఆరా తీయగా.. ప్రియురాలు కుట్ర బయటపడింది. రాచెల్ డోలార్డ్ ప్రియుడికి ముద్దు ఇచ్చే సమయంలో పెదవుల్లో మెథాంఫెటమైన్‌ అనే 14 గ్రాముల డ్రగ్‌ను ఉంచుకుని.. ముద్దుపెట్టే సమయంలో లాలాజలం ద్వారా అతడి నోట్లోకి పంపింది. ఈ కారణంగానే జాషు బ్రౌన్‌ చనిపోయినట్లు దర్యాప్తులో తేలవడంతో పోలీసులు ప్రియురాలిని అరెస్టు చేశారు. అయితే రాచెల్ డోలార్డ్ ప్రియుడిని చంపాలని అలా చేసిందా.. లేక అతడికి డ్రగ్స్ ఇవ్వడం కోసం చేసిందా అని తేలాల్సి ఉంది.

Next Story

Most Viewed