ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌కు షాక్.. చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు

by Kema Shiva Kumar |

ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ (Javed Habib)తో పాటు అతడి కుమారుడు అనస్ హబీబ్ (Anas Habib) మరో ముగ్గురిపై తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ (Sambhal) పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌కు షాక్.. చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ (Javed Habib)తో పాటు అతడి కుమారుడు అనస్ హబీబ్ (Anas Habib) మరో ముగ్గురిపై తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ (Sambhal) పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. క్రిప్టో కరెన్సీ‌ పేరుతో తమ వద్ద పెట్టుబడులు పడితే.. వచ్చిన లాభంలో 50 శాతం నుంచి 75 శాతం వాటా ఇస్తామని 150 మందికి నుంచి డబ్బులు వసూలు చేసి నమ్మబలికారు. అనంతరం ఆ సొమ్మును బిట్‌కాయిన్ రూపంలో ఫోలికల్ గ్లోబల్ కంపెనీ (Follicle Global Company) అనే షెల్ కంపెనీకి మళ్లించనట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే, తాము ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో పాటు వచ్చిన లాభాల్లో వాటా ఇవ్వాలని పెట్టుబడిదారులు అడగ్గా.. తాము పెట్టుబడి పెట్టిన కంపెనీ నష్టపోయిందని, డబ్బులు తిరిగి రావంటూ జెంటా ఎత్తారు. దీంతో బాధితులంతా సంభల్ పోలీస్‌ స్టేషన్‌లో జావేద్ హబీబ్‌తో పాటు అతడి కుమారుడు అనస్ హబీబ్, మరో ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లుగా సంభల్ ఎస్పీ కేకే బిష్ణోయ్ (SP KK Bishnoi) వెల్లడించారు.

Next Story