వేశ్యగా పని చేయాలని భాగస్వామిపై ఒత్తిడి.. ఒప్పుకోక పోవడంతో హత్య..

by Sujitha Rachapalli |

ఆంధ్రప్రదేశ్ బి సవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 22 ఏళ్ల ఓలేటి పుష్పను ఆమె లివ్-ఇన్ పార్టనర్ షేక్ షమ్మా (22) హత్య చేశాడు. పుష్ప.. తన భర్త నుండి విడిపోయి.. గత ఆరు నెలలుగా షమ్మాతో కలిసి జీవిస్తోంది పుష్ప

వేశ్యగా పని చేయాలని భాగస్వామిపై ఒత్తిడి.. ఒప్పుకోక పోవడంతో హత్య..
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ బి సవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 22 ఏళ్ల ఓలేటి పుష్పను ఆమె లివ్-ఇన్ పార్టనర్ షేక్ షమ్మా (22) హత్య చేశాడు. పుష్ప.. తన భర్త నుండి విడిపోయి.. గత ఆరు నెలలుగా షమ్మాతో కలిసి జీవిస్తోంది పుష్ప. అయితే డ్రగ్స్‌కు బానిసైన షమ్మా.. ఆమె నుంచి డబ్బులు లాగుతూ టార్చర్ పెట్టాడు. మనీ లేకపోయే సరికి.. పుష్పను వ్యభిచారంలోకి దిగాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఆమె నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం జరగ్గా... మద్యం మత్తులో పుష్పను ఛాతీ, కాలు భాగాల్లో కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అధిక రక్తస్రావంతో మరణించింది.

పుష్ప తల్లి గంగ, సోదరుడు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా.. వారు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. షమ్మా ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. హత్య కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story