- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొర్రెల స్కామ్: ముగిసిన ఏపీ రైతుల ఈడీ విచారణ
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ ఈడీ విచారణ ముగిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ ఈడీ విచారణ ముగిసింది. సోమవారం బాధితుల వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు రైతులు సోమవారం విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా ఏసీబీ విచారించినట్లు తెలిపారు. 130 యూనిట్ల గొర్రెలను వారి వద్ద నుంచి విక్రమ్, మొయినుద్దీన్, డాక్టర్ విక్రమ్ సాగర్ అనే వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. డబ్బులు వారి బినామీ అకౌంట్లకు తరలించారని చెప్పారు. డబ్బుల కోసం ప్రకాశం నుంచి పలు మార్లు హైదరాబాద్‌కు వచ్చామని.. డబ్బులు అడిగితే బెదిరిపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులు వివరాలు తీసుకుని సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు తమకు న్యాయం జరగలేదని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ప్రభుత్వ పథకం నిధులు మధ్యవర్తులుగా ఉన్నవారు స్వాహా చేసినట్లు.. వారితో అధికారులు సైతం చేతులు కలిపి పక్కదారి పట్టించారని ఏసీబీ దర్యాప్తులో పేర్కొంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా ఈడీ గోర్రెల స్కాం విచారణ చేపట్టింది. ఈ స్కామ్‌లో రూ.1000 కోట్ల వరకు ఆక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.






