మరో ఘోరం.. చిప్స్ తేలేదని భర్తను కత్తితో పొడిచిన భార్య.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |

సోషల్ మీడియాలో ఓ డిస్టర్బింగ్ వీడియో వైరల్ అవుతోంది. చిప్స్ తీసుకురాలేదని భర్తపై కత్తితో దాడి చేసింది భార్య. కూతురు ఆపుతున్నా.. భర్తపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించింది. మొత్తానికి ఇంట్లో

మరో ఘోరం.. చిప్స్ తేలేదని భర్తను కత్తితో పొడిచిన భార్య.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ డిస్టర్బింగ్ వీడియో వైరల్ అవుతోంది. చిప్స్ తీసుకురాలేదని భర్తపై కత్తితో దాడి చేసింది భార్య. కూతురు ఆపుతున్నా.. భర్తపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించింది. మొత్తానికి ఇంట్లో ఓ ప్రమాదకరమైన వాతావరణం కనిపిస్తున్న ఈ వీడియో భర్త, కూతురి భద్రతపై చర్చకు దారితీసింది. కారణం ఏదైనా కత్తితో పొడవడం హింసాత్మక చర్య అని.. హత్యాయత్నం లేదా గృహ హింస వంటి తీవ్రమైన చట్టపరమైన పరిణామాలను కలిగి ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. కానీ ఆమెకు శిక్ష పడదు.. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థ స్త్రీలకే ప్రయారిటీ ఇస్తుందని వాదిస్తున్నారు. మగాళ్లు చనిపోయినా సరే ఆడాళ్లే కోర్టులో గెలుస్తారని.. మెన్ టూ ట్యాగ్స్‌తో కామెంట్స్ పెడుతున్నారు.

ఇక మ్యారేజ్ ఈజ్ స్కారీ అని కామెంట్స్ చేస్తున్న కొందరు.. పెళ్లి చేసుకోకుండా ఉండటమే బెటర్ అంటున్నారు. ఒకవేళ అదే భర్త ఆ పని చేస్తే.. భార్యను దారుణంగా హింసించిన భర్త అని హెడ్ లైన్ వేస్తారని విమర్శిస్తున్నారు. అయినా ఒక్కసారి ఎటాక్ చేసిందంటే.. పగబట్టిన పాముతో సమానమని.. ఆమెతో కలిసి జీవించకపోవడమే బెటర్ అని.. లేదంటే ఎప్పటికైనా భర్త హత్య తప్పదని హెచ్చరిస్తున్నారు.

VIDEO

Next Story